తక్షణమే ట్యాబ్ లో నమోదు చేయాలి

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ గురువారం రైస్ మిల్లర్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలు, పౌరసరఫరాల అధికారులతో సమీక్ష నిర్వహించి, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వెంటనే ట్యాబ్ లో నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 571 కోట్ల రూపాయల విలువైన రెండు లక్షల 39వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించినట్లు తెలిపారు.
