నాగార్జునసాగర్: అనారోగ్యంతో మతిస్థిమితం లేని వ్యక్తి మృతి

568చూసినవారు
నాగార్జునసాగర్: అనారోగ్యంతో మతిస్థిమితం లేని వ్యక్తి మృతి
నాగార్జునసాగర్ పైలాన్ వద్ద మతిస్థిమితం లేని ఒక వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందినట్లు సాగర్ ఎస్సై ముత్తయ్య తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు, కాలికి దెబ్బతగిలి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని కమలానెహ్రూ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 60 ఏళ్ల వెంకట సుబ్బారావుగా గుర్తించారు. ఈ ఘటనపై మున్సిపల్ వార్డు ఆఫీసర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్