నల్గొండ: బస్సు డ్రైవర్‌పై దాడి.. కేసు నమోదు

0చూసినవారు
నల్గొండ: బస్సు డ్రైవర్‌పై దాడి.. కేసు నమోదు
మర్రిగూడ మండల కేంద్రంలో బుధవారం ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ద్విచక్ర వాహనదారుడు దాడికి పాల్పడ్డాడు. నల్గొండ డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు డ్రైవర్ మర్రి ఆంజనేయులు తన వాహనానికి దారి ఇవ్వలేదనే కారణంతో జక్కలి నరసింహ అనే వ్యక్తి బస్సును ఆపి దాడి చేశాడు. కండక్టర్, ప్రయాణికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.