
లొంగిపోయిన 63 మంది మావోయిస్టులు
ఛత్తీస్గఢ్ దంతేవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ ఎదుట 63 మంది మావోయిస్టులు శుక్రవారం లొంగిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘లోన్ వర్రాటు’ (ఇంటికి రండి) పునరావాస కార్యక్రమంలో భాగంగా మావోయిస్టులు భారీ సంఖ్యలో లొంగిపోతున్నారు. వెస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి మోహన్ కడ్డీతో పాటు 18 మంది మహిళా మావోయిస్టులు లొంగిపోయిన వారిలో ఉన్నారు. వారిపై రూ.1.17కోట్ల రివార్డు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.




