నల్గొండ: పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ధర్నా

7చూసినవారు
నల్గొండ మహిళా జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు ధర్నా చేపట్టారు. స్టాక్ ఉన్నప్పటికీ యాజమాన్యాలు కృత్రిమ కొరత సృష్టిస్తూ కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇంధనం కోసం రోడ్డుపై నిరసన తెలపడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అధికారులు వెంటనే స్పందించి కృత్రిమ కొరతను అరికట్టి, ఇంధనం అందేలా చూడాలని వాహనదారులు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్