నల్గొండ: నిరుద్యోగ మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

538చూసినవారు
నల్గొండ: నిరుద్యోగ మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ
నల్గొండ శివారు రాంనగర్ లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, గ్రామీణ నిరుద్యోగ యువతులకు 31 రోజుల పాటు ఉచిత టైలరింగ్ శిక్షణ అందిస్తోంది. సంస్థ సంచాలకులు సియాజీ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం, శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం కూడా కల్పిస్తారు. ఉమ్మడి జిల్లాకు చెందిన 19 నుండి 45 సంవత్సరాల లోపు వారు ఈ శిక్షణకు అర్హులు. ఆసక్తి గలవారు మే 3 లోపు సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, 97010 09265 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్