జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ కు నల్గొండ బాలికల ఎంపిక

1చూసినవారు
జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ కు నల్గొండ బాలికల ఎంపిక
నల్గొండ జిల్లాకు చెందిన అమూల్య, రూప, అక్షర అనే ముగ్గురు బాలికలు చత్తీస్గఢ్లో ఈనెల 25వ తేదీ నుండి జరుగుతున్న జాతీయస్థాయి జూనియర్ బాలికల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ కు రాష్ట్ర జట్టు తరపున ఎంపికయ్యారు. వీరు అప్పాజీపేట జ్యోతిబాపూలే బాలికల మోడల్ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల సహకారంతో వీరు ఫుట్బాల్ క్రీడలో రాణిస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు బండారు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు వివరాలు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్