ఉమ్మడి నల్గొండలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాల కల్పన కోసం ఈ నెల 29న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి పద్మ తెలిపారు. జిల్లాలోని ఐటీఐ క్యాంపస్ గ్రౌండ్స్‌లో గల జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఉదయం 10:30 గంటల నుంచి ఈ మేళా ప్రారంభమవుతుంది. ఎంపికైన వారు NLG, HYD పరిసరాల్లో పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 7893420435 సంప్రదించవచ్చన్నారు.