నల్గొండ: దత్తత తీసుకుని మోసం చేయడం కేసీఆర్‌కు అలవాటు: మంత్రి కోమటిరెడ్డి

9చూసినవారు
దత్తత తీసుకుని మోసం చేయడం కేసీఆర్‌కు అలవాటని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. 'గత పాలకులు కేవలం సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లను మాత్రమే అభివృద్ధి చేసుకున్నారు. దత్తత తీసుకున్న ముడుచింతలపల్లి గ్రామాన్నే మర్చిపోయారు. కేసీఆర్ లాగా నేను ఎప్పుడూ తెలంగాణ జాతిపిత అని చెప్పుకోలేదు. సోనియమ్మ వల్లే తెలంగాణ ఏర్పాటు కల సాకారం అయిందని కేసీఆరే చెప్పారు' అని అన్నారు.