తెలంగాణకు కవిత సీఎం అవుతాననడం జోకులా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ, కవితపై విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఆస్తుల పంపకాన్ని డైవర్ట్ చేయడానికి కేసీఆర్ సభలు పెడుతున్నారని ఆరోపించారు. 'తెలంగాణకు కవిత సీఎం అవుతాననడం జోకులా ఉంది. నేను 6 సార్లు గెలిచా.. తెలంగాణ కోసం రాజీనామా చేశా. నేను కూడా సీఎం కావాలి కదా' అని ఆయన అన్నారు.