99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, అధికారులు ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ వసూళ్లపై దృష్టి సారించారు. గురువారం డివిజన్-46లో ట్రేడ్ లైసెన్సుల సేకరణ, డివిజన్-11, 34లలో ఆస్తిపన్ను వసూళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెవెన్యూ, వార్డు అధికారులు సమన్వయంతో తనిఖీలు ముమ్మరం చేసి, లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.