శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి భారీగా నీటి విడుదల కావడంతో నాగార్జునసాగర్ జలాశయంలోకి వరద ప్రవాహం పెరిగింది. బుధవారం సాయంత్రం నుండి నీటిమట్టం పెరగడంతో అధికారులు 18 గేట్లను 10 అడుగులు, మరో 2 గేట్లను 5 అడుగులు ఎత్తి 2,86,434 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం గరిష్ట నీటిమట్టం 590 అడుగులకు చేరుకుంది. మొత్తం 3,16,397 క్యూసెక్కుల నీరు సాగర్ నుంచి దిగువకు వెళ్తోంది. అధికారులు నదీతీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.