నల్గొండ: రైతులకు అండగా ఉంటాం: మంత్రి

0చూసినవారు
నల్గొండ: రైతులకు అండగా ఉంటాం: మంత్రి
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు అండగా ఉంటామని, ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. చివరి గింజ వరకు కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. గురువారం యాదాద్రి జిల్లాలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు ఉత్తమ్‌, పొంగులేటి, శ్రీధర్‌బాబు పరిశీలించారు. ఇప్పటికే 57 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రైతుల ఖాతాల్లో రూ.10,097 వేల కోట్లు ప్రభుత్వం జమచేసిందన్నారు.

సంబంధిత పోస్ట్