ప్రజలకు మరింత చేరువ కావాలి

0చూసినవారు
ప్రజలకు మరింత చేరువ కావాలి
నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, గ్రామీణ పోలీస్ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువ కావాలని సిబ్బందికి సూచించారు. గురువారం నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, శాంతిభద్రతలు, పెండింగ్ కేసులు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును సమీక్షించారు. సీసీ కెమెరాలు, కోర్టు రికార్డులను పరిశీలించి, ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి త్వరితగతిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్