జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ వివిధ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో అధికారులు బాధ్యతతో పనిచేయాలని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఆర్‌డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఎన్యుమరేషన్ ప్రక్రియను తప్పులు లేకుండా నిర్వహించాలని, ముందుగా సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లను నియమించి, ల్యాండ్‌మార్క్‌లు గుర్తించి మ్యాప్ ఆధారంగా నిర్వహించాలని తెలిపారు.