నల్గొండ జిల్లా అభివృద్ధే మా లక్ష్యం.

1136చూసినవారు
నల్గొండ జిల్లా అభివృద్ధే తమ లక్ష్యమని, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తున్నామని ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి తెలిపారు. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని తమ క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ, వారానికి రెండు రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటానని, సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో జిల్లా అభివృద్ధి పనులకు వేగం పెరిగిందని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రధాన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని, అభివృద్ధి పనులు పూర్తయ్యాకే ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు అడుగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్