
ఏఐ విఫలం.. ఫోర్డ్ కంపెనీలో మళ్లీ ఇంజనీర్ల నియామకం
ఏఐతో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మళ్లీ ఇంజనీర్లను నియమించుకుంటోంది. గతంలో ఉద్యోగాల నుంచి తొలగించిన అనుభవజ్ఞులైన ఇంజనీర్లను కూడా తిరిగి ఆహ్వానిస్తోంది. ఏఐపై అతిగా ఆధారపడటం వల్ల వాహనాల నాణ్యత ప్రమాణాలు పడిపోయాయని, జేడీ పవర్ క్వాలిటీ సర్వేలో వెనకబడ్డామని కంపెనీ సీనియర్ అధికారులు అంగీకరించారు. ఏఐ సామర్థ్యాలపై అతిగా ఊహించుకున్నామని, అనుభవజ్ఞులైన ఇంజనీర్లను పక్కనపెట్టడం పొరపాటని ఫోర్డ్ వైహికిల్ హార్డ్‌వేర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ ఛార్ల్స్ పూన్ వ్యాఖ్యానించారు.




