గురువారం నల్లగొండ జిల్లా తిప్పర్తి సమీపంలో పట్టాలపైకి వచ్చిన గేదెను సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొంది. ఈ ఘటనతో రైలు ఇంజన్ సాంకేతిక సమస్యలు ఎదుర్కొంది, దీంతో నల్గొండ-మిర్యాలగూడ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే టెక్నీషియన్లు యుద్ధప్రాతిపదికన ఇంజిన్ మరమ్మతులు చేపట్టారు. పట్టాలపై రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రమాద సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.