శుక్రవారం నల్లగొండ పట్టణంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీజ్ఞాన్ ప్రతిష్టాన్, యూఎఫ్‌జే అకాడమీ, బొట్టుగూడ హై స్కూల్ విద్యార్థులు శాంతి ర్యాలీ నిర్వహించారు. "స్వదేశీ వస్తువులు ప్రోత్సహిద్దాం, స్వదేశీ జ్ఞానం వర్ధిల్లాలి" అనే నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు. గాంధీ సంస్థల చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, గాంధీ ఆలోచనలు నేటి సమాజానికి అవసరమని, ఆయన మార్గాన్ని అనుసరించిన దేశాలు అభివృద్ధి సాధిస్తున్నాయని తెలిపారు.