జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పక్షాలు సహకరించాలని కోరారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికలపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఈ విషయం తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మంగళవారం షెడ్యూల్ జారీ చేసిందని, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని 6 మున్సిపాలిటీలు, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలను నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.