నల్లగొండ జిల్లా కేంద్రంలోని మినిస్టర్ క్యాంప్ కార్యాలయం(ఇందిరా భవన్) లో ఆదివారం రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. పలువురు వృద్ధులు, మహిళలు, పట్టణానికి చెందిన పలువురు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే పరిష్కారం అయ్యే సమస్యలకు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి క్లియర్ చేయాలని ఆదేశించారు. పలు వినతులు స్వీకరించిన మంత్రి, ఆమోదయోగ్యమైన సమస్యలను వెంటనే పరిష్కరించేలా కృషి చేస్తానని వారికి భరోసా కల్పించారు.