మున్సిపల్ ఎన్నికల పై సంసిద్ధత సమావేశం

స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి మాట్లాడుతూ, పురపాలక ఎన్నికలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని, ఎన్నికల ప్రక్రియ మొత్తం ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎలాంటి లోపాలు లేకుండా జరగాలని స్పష్టం చేశారు.
