నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, వయో వృద్ధులు, దివ్యాంగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి నెలా చివరి శనివారం జరిగే ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శనివారం జరిగిన కార్యక్రమంలో 64 మంది వయో వృద్ధులు, దివ్యాంగులు తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు.