పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండలో వినూత్న నిరసన తెలిపారు. బైక్‌లను నెట్టుకుంటూ వెళ్లి నిరసన తెలిపిన ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తోందని, ఆదాయం తగ్గుతున్న తరుణంలో నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.