ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యం

7చూసినవారు
ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యం
నల్గొండ జిల్లా ఆహార పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఫోస్టాక్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీమతి జ్యోతిర్మయి మార్గదర్శకత్వంలో నల్గొండ పట్టణంలోని కృతుంగా రెస్టారెంట్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఆలయ ప్రసాద తయారీ కేంద్రాలు, రిటైల్ ఆహార సంస్థల్లో పనిచేస్తున్న 90 మంది ఆహార నిర్వాహకులు పాల్గొన్నారు. రోజువారీ పనిలో తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను ఫుడ్ సేఫ్టీ ట్రైనర్ ప్రాక్టికల్ ఉదాహరణలతో వివరించారు.
Job Suitcase

Jobs near you