జిల్లా కేంద్రంలో శుక్రవారం ఈదురుగాలులు, వడగండ్ల వాన బీభత్సం సృష్టించాయి. కలెక్టరేట్ సమీపంలోని ఆర్టీఏ కార్యాలయ రహదారిపై విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలడంతో విద్యుత్, ఇంటర్నెట్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో కార్యాలయంలో ఆర్టీఏ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యల కారణంగా నేటి స్లాట్ బుకింగులను వాయిదా వేస్తున్నట్లు డీటీసీ వాణి తెలిపారు.