చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం, మూడు సంవత్సరాలుగా గ్రామపంచాయతీ వద్ద అనాధగా తిరుగుతున్న రాములు అనే మతిస్థిమితం లేని వ్యక్తిని గుర్తించి మానవత్వం చాటుకున్నారు. పోలీసుల సహాయంతో, సర్పంచ్ రాములును చౌటుప్పల్ మండలంలోని అమ్మానాన్న అనాధ ఆశ్రమంలో చేర్పించారు. ఆశ్రమ నిర్వాహకుడు గట్టు శంకర్ తో మాట్లాడి, చట్ట ప్రకారం ప్రక్రియ పూర్తి చేసి అతనికి ఆశ్రయం కల్పించారు.