నార్కోటిక్స్ జాగిలం తో సోదాలు

1చూసినవారు
నల్లగొండ పట్టణంలో టూ టౌన్ పరిధిలో నార్కోటిక్స్ జాగిలం తో పోలీసులు విస్తృత సోదాలు నిర్వహించారు. గురువారం మిషన్ పరివర్తన్ లో భాగంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో ఈ తనిఖీలు చేపట్టినట్లు టూ టౌన్ ఎస్ఐ సైదులు తెలిపారు. వాహనాలు, లాడ్జింగ్‌లు, పాన్‌షాపులపై జాగిలం సహాయంతో తనిఖీలు జరిగాయి. డ్రగ్స్, గాంజా వంటి మత్తు పదార్థాలు సేవించినా లేదా విక్రయించినా డయల్ 100కు లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని సూచించారు.

ట్యాగ్స్ :