ప్రశ్నాపత్రం లీకేజీపై SFI ఆందోళన..నాయకుడు అరెస్ట్

1255చూసినవారు
ప్రశ్నాపత్రం లీకేజీపై SFI ఆందోళన..నాయకుడు అరెస్ట్
నల్గొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గంలో ప్రశ్నాపత్రం లీకేజీని నిరసిస్తూ చలో లోక్ భవన్ కార్యక్రమానికి SFI పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యగా MGU SFI నాయకుడు కరీం రవికుమార్ ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి నకిరేకల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ, అక్రమ అరెస్టులు విద్యార్థి ఉద్యమాలను అణచలేవని, తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్