తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జర్నలిస్టులు పట్టణంలోని గడియారం సెంటర్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి, అమరవీరులకు నివాళులర్పించారు.