సర్ ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలి

977చూసినవారు
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఎన్నికల ప్రక్రియను వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. జిల్లాలో 1,812 మంది బీఎల్‌ఓలకు కిట్లు, టీ-షర్టులు, క్యాపులు, ఐడీ కార్డులు పంపిణీ చేశామని, వారికి అవసరమైన ఎన్యుమరేషన్ ఫారాలను అందించామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు 94 శాతం ఫారాల పంపిణీ పూర్తయిందని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్