తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతిని నల్లగొండ జిల్లా కేంద్రంలో బీసీ సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్‌లో శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2009లో తెలంగాణ ప్రకటన కోసం ఎదురుచూస్తున్న సమయంలో, ప్రకటనను వెనక్కి తీసుకోవడాన్ని జీర్ణించుకోలేక ఎల్బీ నగర్ చౌరస్తాలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని శ్రీకాంతాచారి ఆత్మార్పణం చేసుకున్నారని నాయకులు కొనియాడారు.