ప్రత్యేక ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వయో వృద్ధులు, దివ్యాంగుల కై ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో (72) మంది దివ్యాంగులు, వయోవృద్ధులు వారి సమస్యల పరిష్కారానికి దరఖాస్తులను సమర్పించారు.