ప్రత్యేక వార్డు సభలను విజయవంతం చేయాలి

3చూసినవారు
ప్రత్యేక వార్డు సభలను విజయవంతం చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, ఈ నెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహించే ప్రత్యేక వార్డు సభలను జయప్రదం చేయాలని నల్లగొండ మున్సిపల్ కమిషనర్ బచ్చలకూరి శరత్ చంద్ర కోరారు. బుధవారం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో సెక్షన్ హెచ్ఎఓడీలు, వార్డు అధికారులు, పర్యవేక్షణ అధికారులు, శానిటరీ జవాన్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ పిలుపునిచ్చారు. 4వ తేదీ నుండి రోజుకు 12 డివిజన్ల చొప్పున నాలుగు రోజులపాటు, అంటే 8వ తేదీ వరకు అన్ని వార్డుల్లో ప్రత్యేక వార్డు సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.