ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాల

0చూసినవారు
ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాల
రైతులు ఇబ్బందులు పడకుండా రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. మంగళవారం నల్గొండ జిల్లా, చిట్యాల మండలంలోని ఉదయ్ రైస్ మిల్, వెంకటేశ్వర రైస్ మిల్లులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైస్ మిల్లు యజమానులతో మాట్లాడుతూ, ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, రోజుకు కనీసం 10 లారీల ధాన్యాన్ని అన్‌లోడ్ చేయాలని, పనిని తగ్గించకుండా పూర్తి సామర్థ్యంతో కొనసాగాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్