గురువారం శ్రీలంకకు చెందిన 30 మంది మీడియా ప్రతినిధుల బృందం అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌ను సందర్శించింది. హైదరాబాదులోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న వీరు, తెలంగాణ దర్శన్ కార్యక్రమంలో భాగంగా సాగర్‌కు వచ్చారు. బుద్ధవనం చేరుకున్న బృందం, బుద్ధ పాదాల వద్ద వందనం సమర్పించి, బుద్ధవనం విశేషాలపై లఘు చిత్రాన్ని వీక్షించింది.