నల్గొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి విద్యార్థి అమరవీరుడు శ్రీకాంతాచారి 16వ వర్ధంతిని పురస్కరించుకొని, ఎంజి యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీకాంతాచారి త్యాగమే తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మలుపు తిప్పిన ఘట్టమని, ఆయన మరణం మొత్తం రాష్ట్ర యువతను ఒకే లక్ష్యం కోసం సమీకరించిందని అన్నారు. ఆయన ఆశయాలకు అంకితం కావాలని పేర్కొన్నారు.