జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ గురువారం తహసిల్దారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో, పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులను జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ కేసుల్లో ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడేలా బలమైన కౌంటర్లు దాఖలు చేయాలని, అవసరమైన రికార్డులను సమగ్రంగా కోర్టుకు సమర్పించాలని సూచించారు. ఎక్కువకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులకు ప్రాధాన్యతనిచ్చి, కాలపరిమితిలోగా పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.