అక్రమ దత్తత తీసుకుంటే కఠిన చర్యలు

2చూసినవారు
అక్రమ దత్తత తీసుకుంటే కఠిన చర్యలు
అక్రమ దత్తత చట్టరీత్యా నేరమని, అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా, బాలల భద్రత, రక్షణ, మత్తు పదార్థాలకు 'నో చెప్పండి' అనే అంశాలపై ఈనెల 27 నుండి మే 2 వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో, చట్టబద్ధమైన దత్తతపై అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఆయన ప్రారంభించారు.