నల్లగొండ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో బీటెక్ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్, టాస్క్ పేరుతో విద్యార్థుల నుండి రూ. 3 లక్షలు వసూలు చేసి దుర్వినియోగం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, అఖిలపక్ష విద్యార్థి సంఘాలు మంగళవారం బీటెక్ కాలేజీ ప్రధాన గేటు వద్ద ఆందోళనకు దిగి, ప్రొఫెసర్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.