మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ కనెక్ట్ విభాగం ఆధ్వర్యంలో ఎంబీఏ చివరి సంవత్సరం 25 మంది విద్యార్థులకు వ్యాపార అభివృద్ధి అవకాశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సతీష్ కుమార్, చార్టెడ్ అకౌంటెంట్ పిల్లి మహేష్ ముఖ్య అతిథులుగా హాజరై, పరిశ్రమల స్థాపన, నిర్వహణ పథకాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.