తెలుగుదేశం కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

0చూసినవారు
నల్లగొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నల్లగొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి జాతీయ, పార్టీ జెండాలను ఎగురవేసి, స్వీట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి, నల్లగొండ నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ ఎల్. వి. యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ ఏర్పాటు ప్రజల 55 ఏళ్ల కోరికను తీర్చినందుకు వారు నాటి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :