పోలీస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

5చూసినవారు
పోలీస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ అధికారులు తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, ఆర్. ఐ లు, ఎస్సైలు, మినిస్టీరియల్, మహిళా పోలీస్ సిబ్బందితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్