తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా నల్లగొండలో అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 60 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర కల అమరవీరుల త్యాగఫలితంగా నెరవేరిందని ఆయన ఈ సందర్భంగా స్మరించుకున్నారు.