నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ పాయల్ రాజుకు తెలంగాణ సేవా పథకం లభించింది. 2000 సంవత్సరంలో పోలీస్ శాఖలో చేరిన ఆయన 25 ఏళ్ల సుదీర్ఘ సేవలో క్రమశిక్షణతో ఆదర్శంగా నిలిచారు. జిల్లా స్పెషల్ పార్టీలో 8 ఏళ్లు పనిచేసి, కీలక ఆపరేషన్లలో పాల్గొన్నారు. 2022లో కిడ్నీ రాకెట్ కేసు చేదనలో చూపిన ప్రతిభతో హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. శుక్రవారం టూ టౌన్ ఎస్ఐ వై. సైదులు ఆయనను సన్మానించి, డీఎస్పీ, సీఐ అభినందనలు తెలిపారు.