సీఎం రేవంత్ పర్యటన వేళ ఉద్రిక్తత

0చూసినవారు
సీఎం రేవంత్ పర్యటన వేళ ఉద్రిక్తత
తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నల్లగొండ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించింది. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముఖ్యమంత్రి జిల్లాలో ఎలా పర్యటిస్తారని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు మేడి నరేష్ ప్రశ్నించారు. నల్లగొండలోని ఎన్‌జీ కళాశాల ప్రధాన ద్వారం వద్ద సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి మునుగోడు నియోజకవర్గ ఇంచార్జ్ తెలంగాణ మాధవక్క, ఆలేరు ఇంచార్జ్ కందాడి మణిపాల్‌లతో పాటు దాదాపు 50 మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :