టీజీ ఐసెట్ ఫలితాలు విడుదల

1చూసినవారు
టీజీ ఐసెట్ ఫలితాలు విడుదల
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశానికి నిర్వహించిన టీజీ ఐసెట్ ఫలితాలను శుక్రవారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి, సెట్ చైర్మన్, ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ విడుదల చేశారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షలకు 46,654 మంది హాజరు కాగా, 91.22% మంది ఉత్తీర్ణత సాధించినట్లు కన్వీనర్ ఆచార్య అల్వాల రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆచార్య ఇటుకాల పురుషోత్తం, ఆచార్య మహమూద్ అలీ, ఆచార్య శ్రీరామ్ వెంకటేష్, ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, డా. మిరియాల రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్