నల్గొండ: ఈనెల 15న ఆహార కమిషనర్ చైర్మన్ రాక

66చూసినవారు
నల్గొండ: ఈనెల 15న ఆహార కమిషనర్ చైర్మన్ రాక
క్షేత్రస్థాయిలో జాతీయ ఆహార భద్రత చట్టం- 2013 అమలు పరిశీలన నిమిత్తం రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్, సభ్యులు 15న కొండమల్లేపల్లి, దేవరకొండ మండలాలలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఆహార కమిషన్ ఒకరోజు పర్యటనలో భాగంగా కొండమల్లేపల్లి, దేవరకొండ మండలాలలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, చౌక ధర దుకాణాలు, అంగన్వాడి కేంద్రాలు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలను పరిశీలిస్తారని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్