రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, అధికృత డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విత్తన కేంద్రాలను ఏర్పాటు చేసి రాయితీపై రైతులకు విత్తనాలను అందజేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద తెలంగాణ విత్తన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన కేంద్రాన్ని ప్రారంభించారు.