నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కౌన్సిలింగ్ సెంటర్, లైన్స్ క్లబ్ సహకారంతో 'మహిళలపై హింస'పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డా. రాజేశ్వరి, డా. మంజుల, డా. విశ్వజ్యోతి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. డా. రాజేశ్వరి మాట్లాడుతూ, నేటి సమాజంలో మహిళలు అనేక రూపాల్లో హింసను ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా డిజిటల్ హింస పెరుగుతోందని వివరించారు.